బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రాను రాను రక్తి కడుతుంది. మిత్రుల మధ్య కూడా ఫైటింగ్ పుట్టి ప్రేక్షకులకి మంచి వినోదాన్నే పంచుతున్నారు బిగ్ బాస్.సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగగా, ఇందులో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ బాగానే జరిగింది. ఇక మంగళవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇవ్వగా ఇందులో ఇంటి సభ్యుల మధ్య వార్ హోరాహోరీగా సాగింది.
యాంకర్ రవి వలన నటరాజ్ మాస్టర్ హర్ట్ అయినట్టు వీజే సన్నీకి పరోక్షంగా వివరించాడు. ఇక శ్వేత.. ఉమాదేవి వలన చాలా హర్ట్ అయినట్టు చెప్పుకొచ్చింది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడడం లేదని పేర్కొంది. సెకండ్ వీక్ కూడా జన్యూన్ రీజన్స్ లేవని, అన్ని చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేశారని ఉమా.. ప్రియాతో చెప్పుకొచ్చింది.
ఇక నామినేషన్ ప్రక్రియలో లోబో.. మానస్‌పై ఫైర్ కావడం ఏ మాత్రం అర్ధం కావట్లేదు. అతన్ని మంచి దారిలో తీసుకెళ్లి ఫ్రెండ్ షిప్ గురించి వివరిద్ధామంటే అతను నన్నే నామినేట్ చేస్తున్నాడు అని రవి.. లహరితో చెప్పుకొచ్చాడు. ఇక సన్నీ.. ఉమాదేవికి గీతోపదేశం చేసే ప్రయత్నం చేశాడు. కోపం, ప్రేమ రెండు ఉండాలని అన్నాడు. దీనికి ఆమె నేను ఇలాగే ఉంటా, ఎవరితోనైనా ఇలానే మాట్లాడుతా నని తెల్చిచెప్పింది.
నా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో కూడా ఇలానే మాట్లాడుతాను అంటూ కౌంటర్ వేసింది. ఇక కాజల్ దగ్గరకు వెళ్లిన సన్నీ.. నీలో స్వీట్నెస్, క్యూట్ నెస్ మిస్ అవుతుందని చెప్పాడు. దానికి స్పందించిన కాజల్.. నేను స్వీట్‌గా క్యూట్‌గా ఉంటే ఫేక్ అంటున్నారని, అందుకే ఇలా ఉంటున్నానని చెప్పుకొచ్చింది.