ఆదివారం 23 ఫిబ్రవరి 2020
గుండెపోటుతో న‌టుడు ఉద‌య్ మృతి

గుండెపోటుతో న‌టుడు ఉద‌య్ మృతి

Feb 15, 2020 , 11:27:57
PRINT
గుండెపోటుతో న‌టుడు ఉద‌య్ మృతి

ప‌రారి, ఫ్రెండ్స్ బుక్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన యువ న‌టుడు ఉద‌య్ (34). ఆయ‌న శుక్ర‌వారం రాత్రి 10.30ని.ల స‌మ‌యంలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఉద‌య్ మృతికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. అయితే అనేక వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉండేవాడు ఉద‌య్‌.  2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్ర‌గ్స్ కేసులోను నిందితుడిగా ఉన్నాడు. కాకినాడ‌లో ఓ మ‌హిళ‌కి సినిమా ఛాన్స్ ఇప్పిస్తాన‌ని చెప్పి మోసం చేసిన కేసులోను అరెస్ట్ అయ్యాడు. 2016లో అత‌ని మాన‌సిక ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో ఎర్ర‌గ‌డ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స కూడా అందించారు. తెలుగుతో పాటు ప‌లు త‌మిళ సినిమాలలోను న‌టించాడు ఉద‌య్‌. 


logo