శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 10:39:43

సంక్రాంతి రేస్‌లో రెండు చిత్రాలు రెడీ!

సంక్రాంతి రేస్‌లో రెండు చిత్రాలు రెడీ!

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కుర‌వాలి అంటే సినిమాలని పండ‌గ సమ‌యంలో విడుద‌ల చేయ‌డం నిర్మాత‌లుకు బెస్ట్ ఆప్ష‌న్. ఈ సారి కరోనా వ‌ల‌న ద‌సరాకు బ‌డా సినిమాల సంద‌డి లేకుండా  పోయింది. సంక్రాంతికి మాత్రం స్టార్ హీరోలు త‌మ సినిమాలతో సంద‌డి చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ చిత్రం సంక్రాంతికి వ‌స్తుంద‌ని హింట్స్ రాగా, తాజాగా ఇదే రేసులో రామ్ రెడ్ చిత్రం, ర‌వితేజ క్రాక్ చిత్రాలు నిలిచాయి. 

రామ్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'రెడ్‌'. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్‌ ప్రభావంతో ఆగింది.  అయితే  'దేవదాస్‌, మస్కా' చిత్రాల తర్వాత రెడ్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు రామ్. మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 

ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం క్రాక్. ఉభయ రాష్ట్రాల‌లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సముద్రఖని, వరలక్ష్మీశరత్‌కుమార్‌, దేవిప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు