మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 08:26:21

బోనీ క‌పూర్ ఇంట్లో మూడుకి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌

బోనీ క‌పూర్ ఇంట్లో మూడుకి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌

క‌రోనా మ‌హ‌మ్మారి బాలీవుడ్‌ని వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే  ప్రముఖ సింగర్ కనిక కపూర్, నిర్మాత  కరీం మోరాని ఆయ‌న‌ ఇద్దరు కూతుళ్ళు, విల‌క్ష‌ణ నటుడు  ఫ్రెడీ తండ్రి  ,బాలీవుడ్ నటుడు సత్య జిత్ తల్లి క‌రోనా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక రీసెంట్‌గా బోని క‌పూర్ ఇంట్లో ప‌ని చేసే చ‌ర‌ణ్ సాహుకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని బోని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.  తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకింది.

ముంబయిలోని లోకంద్‌వాలాలో బోని తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో కలిసి ఉంటున్నారు. బోని ఇంట్లో పని చేసే చ‌రణ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. అత‌నికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగ‌తా అంద‌రికి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా బోనితో పాటు అత‌ని ఇద్ద‌రి కూతుళ్ళ‌కి నెగెటివ్ అని వ‌చ్చింది. కాక‌పోతే ఆ ఇంట్లో ప‌ని చేసే మ‌రో ఇద్దరికి కరోనా సోకిన‌ట్టు తేలింది. దీంతో బోని ఫ్యామిలీ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కరోనా సోకిన తన సిబ్బందికి కావాల్సిన ట్రీట్‌మెంట్ బోని కపూర్ చేయిస్తున్నట్టు తెలుస్తుంది.


logo