మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 06:52:08

ప్రభాస్‌ చేతిలో మరో రెండు సినిమాలు..!

ప్రభాస్‌ చేతిలో మరో రెండు సినిమాలు..!

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ స్టార్‌హీరో ప్రభాస్‌ మరో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం రాథాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో నటించనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత చేయబోయే ప్రాజెక్టులపై ప్రభాస్‌ ఎప్పటికే నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. తన సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్‌లోనే ఓ సినిమాని చేయబోతున్నట్లు సమాచారం.

ఆ మేరకు ఇప్పటికే ఒప్పదం కుదిరిందని సమాచారం. ఆ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు ఇటు టాలీవుడ్‌తో పాటు బాలివుడ్‌లో సైతం అభిమానులు ఉన్నారు. అతను ఏ భాషలో సినిమా చేసిన..అది ఇతర భాషల్లోనూ విడుదలవుతుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo