సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 17, 2021 , 21:40:34

రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?

రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?

మెగా హీరోలంతా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు అంతా ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసారు. అదే దారిలో రామ్ చరణ్ కూడా వెళ్తున్నాడు. ఈయన ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. మధ్యలో కొన్ని చిన్నచిన్న బ్రేకులు వస్తున్నాయి కానీ వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. 

మరోవైపు ట్రిపుల్ ఆర్ తో పాటు ఆచార్యలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు మెగా వారసుడు. ఈ సినిమాలో తండ్రితో పాటు కలిసి నటిస్తున్నాడు ఈయన. దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ పాత్రలో రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ పాత్రతోనే సినిమా కథ అంతా మారిపోతుంది. తాజాగా ఆచార్య సెట్ లోనూ అడుగు పెట్టాడు రామ్ చరణ్. ఇందులో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు ఈయన. 

సిద్ధ పాత్ర కోసం తనను తాను చాలా సిద్ధం చేసుకున్నాడు మెగా వారసుడు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నాడు రామ్ చరణ్. అందులో గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడు. జెర్సీతో ఈయన తనేంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నాడు. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరి కాకుండా మరో ఇద్దరు దర్శకులు కూడా రామ్ చరణ్ కు కథలు చెప్పారని తెలుస్తుంది. వాళ్లలో సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడని తెలుస్తుంది. చాలా రోజులుగా ఈయనతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. కానీ కన్ఫర్మేషన్ రాలేదు.. అయితే ఈ మధ్యే మాటల మాంత్రికుడు చెప్పిన లైన్ రామ్ చరణ్ కు నచ్చిందని తెలుస్తుంది. మరోవైపు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని సైతం రామ్ చరణ్ కు ఓ కథ చెప్పినట్లు తెలుస్తుంది.

పోలీస్ ఆఫీసర్ కథను రవితేజతో అదిరిపోయే ప్రజెంట్ చేసిన ఈయన.. మెగా పవర్ స్టార్‌కు కూడా ఓ పవర్ ఫుల్ స్టోరీ నెరేట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు మాస్టర్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ చెప్పిన కథను కూడా రామ్ చరణ్ విన్నాడని ఇండస్ట్రీలో వార్తలున్నాయి. అయితే ఇంతమంది కథలు విన్నా కూడా నెక్ట్స్ ఎవరితో.. ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉండిపోయింది. దానికి సమాధానం రామ్ చరణ్ ఒక్కడే ఇవ్వగలడు.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo