శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 17:15:46

క్యూటీతో అవికాగోర్ గ్లామ‌ర‌స్ లుక్‌..ఫొటోలు వైర‌ల్

క్యూటీతో అవికాగోర్ గ్లామ‌ర‌స్ లుక్‌..ఫొటోలు వైర‌ల్

బాలికావ‌ధు సీరియ‌ల్ తో చైల్డ్ ఆర్టిస్టుగా దేశ‌వ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది అందాల బ్యూటీ అవికాగోర్‌. తెలుగులో ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాలు చేసినా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాయి. మ‌ధ్య‌లో కొంత బొద్దుగా మారిన ఈ సుంద‌రి మ‌ళ్లీ సైజ్ జీరో లా నాజూకుగా మార‌డానికి చాలానే శ్ర‌మించిన‌ట్టు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇటీవ‌లే త‌న ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఎయిర్ పోర్టుకు నుంచి వ‌స్తుండ‌గా కెమెరాల‌కు ఫోజులిచ్చింది.

పంజాబీ డ్రెస్ లో అవికా క్యూట్ గా ఉన్న పెట్‌ను ఎత్తుకొని ఫొటోలు దిగింది. మ‌ళ్లీ మ‌నుప‌టి లుక్ లో క‌నిపిస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. టూ క్యూటీస్ టుగెద‌ర్ అనే క్యాప్ష‌న్ తో ఉన్న ఈ ఫొటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.