మంగళవారం 14 జూలై 2020
Cinema - May 25, 2020 , 11:15:13

నెటిజ‌న్‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పిన సోనూసూద్

నెటిజ‌న్‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పిన సోనూసూద్

క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం చేప‌ట్టిన లాక్‌డౌన్ వ‌ల‌న వ‌ల‌స కార్మికులు చాలా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వారి బాధ‌ల‌ని గుర్తించిన సోనూ సూద్ కొద్ది రోజులుగా అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ని చేప‌డుతున్నారు. ముంబైలోని త‌న హోట‌ల్‌ని వైద్య సిబ్బందికి కేటాయించిన సోనూ.. పంజాబ్‌లో వైద్యులకు 1500 పీపీఈ కిట్లు  అందించారు. అలానే వలస కార్మికులు తమతమ సొంతూళ్లకు వెళ్లేందుకు  బ‌స్సుల‌ని ఏర్పాటు చేశారు.  సోనూ సూద్‌ అందిస్తున్న సేవలకు కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ కూడా ప్రశంసలు కురిపించారు.  

సోనూసూద్ చేస్తున్న సామాజిక సేవ‌ల‌లో భాగంగా ఓ నెటిజ‌న్ ఆయ‌న‌ని వింత ప్ర‌శ్న అడిగాడు. లాక్‌డౌన్ వ‌ల‌న నేను ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాను. కొంచెం లిక్క‌ర్ షాపుకి తీసుకెళ్ళ‌డానికి సాయ‌ప‌డ‌తారా అని ట్వీట్ చేశాడు. దీనికి స‌మాధానంగా సోనూ.. లిక్క‌ర్ షాపు నుండి ఇంటికి తీసుకుపోవ‌డానికి త‌ప్ప‌క సాయ‌ప‌డ‌తాను. అవ‌స‌ర‌మైతే చెప్పండి అని కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కొద్ది క్ష‌ణాల‌లోనే 35000 లైకులు, 4000 రీట్వీట్స్ చేశారు. కొన్ని వేల కామెంట్స్ పెట్టారు. సోనూ సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌తో  పాటు ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌ని నెటిజ‌న్స్ ఎంత‌గానో ప్రశంసిస్తున్నారు. 


logo