శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 15, 2021 , 15:37:39

గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి

గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి

శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో వ‌చ్చిన లీడ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఢిల్లీ సుంద‌రి రిచా గంగోపాధ్యాయ. ఆ త‌ర్వాత హ‌రీష్ శంకర్-ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన మిరప‌కాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప‌దేళ్లు పూర్తిచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామ్య‌మైన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు హ‌రీష్ శంక‌ర్. ఈ చిత్రంలో విన‌మ్రగా న‌టించిన రిచా గంగోపాధ్యాయ్ కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ ద్వారా త‌న సందేశాన్ని పోస్ట్ చేశాడు. 

దీనిపై రిచా స్పందిస్తూ..ధ‌న్య‌వాదాలు హ‌రీష్‌. విన‌మ్ర పాత్ర‌లో న‌టించడం మ‌రుపురాని అవ‌కాశం. తెర‌వెనుక మీ గురించి తెలుసుకున్న వ్య‌క్తులు అదృష్ట‌వంతులు. మీరు అద్బుత‌మైన వ్య‌క్తి. తెలివైన దర్శ‌కుడు. ఫ‌న్ ల‌వ్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం ఉన్న వ్య‌క్తి. ఏదో ఒక రోజు మీరు నాకు అతిథి పాత్ర ఇచ్చే విష‌యాన్ని ప‌రిశీలిస్తారనుకుంటున్నానని రీట్వీట్ చేసింది. 

దీనికి వెంట‌నే హ‌రీష్‌శంక‌ర్ స్పందిస్తూ..అతిథి పాత్ర‌..ఇపుడు మీ ట్వీటే రుజువు. రెడీగా ఉండండి..అంటూ రీట్వ్‌ట్ చేయ‌గా..కేవ‌లం మీ కోసమే..న‌వ్వుతూ క‌నిపించే మీ కండ్ల కోసం..షూటింగ్ కు మార్గం క‌నుగొనండి అంటూ రిచా రిప్లై ఇచ్చింది. సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న రిచా పెండ్లి చేసుకుని వైవాహిక జీవితంపై త‌న ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం సొంత వ్యాపారాన్ని మొద‌లు‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భాస్ 'స‌లార్' షురూ

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!
మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌
మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo