ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 20:41:54

రెడ్ హ్యాండెండ్‌గా డ్రగ్స్ కేసులో దొరికిన మరో టీవీ నటి

రెడ్ హ్యాండెండ్‌గా డ్రగ్స్ కేసులో దొరికిన మరో టీవీ నటి

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్ననార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా ఎన్‌సీబీ చేతికి చిక్కింది. 'సంవాదన్ ఇండియా', 'దేవో కె దేవ్ మహదేవ్' వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా మంచి పేరు సంపాదించుకుంది. కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

సివిల్ డ్రెస్‌లో ఉన్న ముంబై ఎన్‌సీబీ అధికారులు వెర్సోవా, ముంబైలలో మోహరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నది. బాలీవుడ్‌లో తాజాగా ప్రీతికా చౌహాన్ అరెస్ట్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.