శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 15:47:36

టీవీ న‌టిపై క‌త్తితో దాడి.. ప్రాణాపాయం లేద‌న్న వైద్యులు

టీవీ న‌టిపై క‌త్తితో దాడి.. ప్రాణాపాయం లేద‌న్న వైద్యులు

టీవీ న‌టి మ‌ల్వి మ‌ల్హోత్రాపై క‌త్తితో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. క‌త్తితో ఆమె ఉద‌రం,చేతుల‌పై యోగేష్ మ‌హిల్ పాల్ సింగ్ అనే వ్య‌క్తి దాడి చేయ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. స్థానికులు   వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో ప్రాణాపాయం నుండి త‌ప్పించుకుంది. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. 

ఏడాది నుండి మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న సింగ్‌, మ‌ల్విల మ‌ధ్య ఇటీవ‌ల‌ పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయి . దీంతో కొద్ది రోజులుగా మ‌ల్వి అత‌నితో మాట్లాడ‌డం మానేసింది. అత‌ను పెళ్లి చేసుకుందామ‌న్న కూడా రిజెక్ట్ చేసింది. ఈ క్ర‌మంలో కోపంతో ఊగిపోయిన సింగ్‌.. కేఫ్ నుండి ఇంట‌కి వెళుతున్న మాల్విపై క‌త్తితో దాడి చేశాడు. ముంబైలోని వ‌ర్సోవా ఏరియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అతడిపై కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.  (చూడండి : పిల్లలు పక్కెందుకు తడుపుతారు?..వీడియో )