ముంబై: టీవీ నటుడు పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై రేప్, వేధింపుల కేసుల నమోదయ్యాయి. ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలు అతడిపై ఉన్నాయి. అతనితోపాటు మరో ఐదుగురిపై కూడా ముంబైలోని మాల్వానీ పోలీసులు రేప్ కేసు పెట్టారు. తనపై కారులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పర్ల్ పూరీని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే సీరియల్తో టీవీ అరంగేట్రం చేశాడు పర్ల్ వీ పూరి. ఆ తర్వాత నాగిన్ 3తో పాపులర్ అయ్యాడు. తాజాగా బ్రహ్మరాక్షస్ 2లో నటించాడు.