శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 17:45:08

‘టక్ జగదీష్’ మాస్ యాంగిల్ అదిరింది..టీజర్

‘టక్ జగదీష్’ మాస్ యాంగిల్ అదిరింది..టీజర్

నాని సినిమా అంటే కుటుంబం అంతా కలిసి చూసే పండగలా ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా కూడా మరీ బోర్ కొట్టించుకుండా ఉంటాడు అనే నమ్మకం అయితే ప్రేక్షకుల్లో పెంచేసాడు నేచురల్ స్టార్. ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా నేడు టక్ జగదీష్ టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. టీజర్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనింగ్ గా కట్ చేసారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 


టీజర్ లో డైలాగులు లేవు..కేవలం పాటను మాత్రమే విడుదల చేసారు. అందులోనే కథ చెప్పాడు దర్శకుడు శివ. నాని కూడా చాలా రోజుల తర్వాత పక్కా మాస్ రోల్ చేస్తున్నాడు. కానీ క్లాస్ గా కనిపిస్తున్నాడు. మిర్చిలో ప్రభాస్ ఉన్నట్లు హాయిగా టక్ చేసుకుని వచ్చి మాస్ గా దంచేస్తున్నాడు. మరి టక్ జగదీష్ తో నాని ఎంతవరకు మాయ చేస్తాడో చూడాలి. జగపతిబాబు, నాజర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

నిన్నుకోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నాని నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హ్యాట్రిక్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోవాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న టక్ జగదీష్ ఎప్రిల్ 23న విడుదల కానుంది. తొలి రెండు సినిమాలు పూర్తిగా క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన శివ.. మూడో సినిమాతో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని బాగా గట్టిగా ఫిక్స్ అయినట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. జెర్సీ తర్వాత సరైన విజయం లేక అభిమానులకు భారీగా బాకీ పడిపోయాడు నాని. ఇలాంటి సమయంలో తనకు నిన్నుకోరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శివ నిర్వాణతో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు నాని. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo