గతేడాది టాలీవుడ్ యువ నటుల్లో నితిన్, నిఖిల్ బ్యాచ్‌లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే మరో యువ హీరో నడువబోతున్నాడనే వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఆ యువ హీరో ఎవరనే కదా మీ డౌటు..రాజ్ తరుణ్. ఈ ఏడాది చివరికల్లా పెండ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నాడట. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త ఇంట్లోకి మారాడు రాజ్ తరుణ్.
త్వరలోనే పెండ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలనుకుంటున్నాడన్న వార్తలు ఊపందుకోగా..దీనిపై రాజ్ తరుణ్ మాత్రం కామెంట్స్ చేయడం లేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!