సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 11:43:49

ఎనర్జిటిక్ స్టార్‌తో సినిమా చేసేందుకు సిద్ధ‌మైన త్రివిక్ర‌మ్

ఎనర్జిటిక్ స్టార్‌తో సినిమా చేసేందుకు సిద్ధ‌మైన త్రివిక్ర‌మ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వ‌రుస ప్రాజెక్ట్‌లు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో సినిమా క‌మిట్ కాగా, రీసెంట్‌గా మ‌హేష్‌, రామ్‌ల‌ని క‌ల‌సి క‌థ‌లు వినిపించారట‌. ఇద్ద‌రు హీరోలు ఓకే చెప్ప‌డంతో ఆ ప్రాజెక్ట్స్‌ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ‌తాడా అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో పూర్తి కానుంది. ఈ సినిమాకు  'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. డిసెంబ‌ర్‌లో లేదంటే జ‌న‌వరిలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తుండ‌గా, ఇది పూర్తైన వెంట‌నే మ‌హేష్ బాబు, రామ్‌ల ప్రాజెక్ట్స్‌ని ఏక‌కాలంలో తెర‌కెక్కించేలా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాడ‌ట‌. కాగా, మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, రామ్ ..రెడ్ చిత్రం చేస్తున్నాడు.