టాలీవుడ్ లో త్రివిక్రమ్-మహేశ్‌బాబు కాంబినేషన్ అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో మరో సినిమాకు అంతా సిద్దమవగా..అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలి ఉంది.
అయితే మహేశ్‌బాబుతో సినిమా చేసే కంటే ముందు రాజమౌళి నుంచి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. రాజమౌళి రిప్లై కోసం త్రివిక్రమ్ వెయిట్ చేయడమేంటనుకుంటున్నారా..? రాజమౌళి గతంలో మహేశ్‌బాబుతో సినిమా చేస్తానని ప్రకటించాడు.
తన తర్వాత ప్రాజెక్టు మహేశ్‌బాబుతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే ఎప్పుడు లాంఛింగ్ అనేది మాత్రం చెప్పలేదు జక్కన్న. బాహుబలి డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాకే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తాడా..? లేదా వెంటనే మొదలుపెడ్తాతా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా మేలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మహేశ్‌బాబు ప్రాజెక్టు కోసం టైం వృథా కాకుండా జక్కన్న నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నాడట.
మరి మహేశ్-త్రివిక్రమ్ సినిమా తెరరూపం దాల్చాలంటే జక్కన్న తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అంతా చర్చించుకుంటున్నారు.