ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 12:14:13

మ‌హేష్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్ర‌మ్

మ‌హేష్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్ర‌మ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌ప్పుడు చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాని ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన కొన్ని విభేదాల వ‌ల‌న ఒక‌రికొక‌రు దూరంగా ఉంటున్నార‌ని ఇండ‌స్ట్రీ టాక్. అయితే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్..మ‌హేష్‌తో క‌లిసి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్న ఆయ‌న త్వ‌ర‌లో మ‌హేష్‌కి అది వినిపించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

మ‌హేష్ బాబు త్వ‌ర‌లో ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ .. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఇద్ద‌రి ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా, మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo