శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 18:18:59

స్ర‌వంతి ర‌వికిశోర్ కు త్రివిక్ర‌మ్ పాదాభివంద‌నం

స్ర‌వంతి ర‌వికిశోర్ కు త్రివిక్ర‌మ్ పాదాభివంద‌నం

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..త‌‌న కలం నుంచి జాలువారిన సంభాష‌న‌ల‌తో మంత్రముగ్దుల‌ను చేస్తూ మాట‌ల మాంత్రికుడిగా కోట్లాదిమంది ఫాలోవ‌ర్లను సంపాదించుకున్న డైరెక్ట‌ర్. ఈ ద‌ర్శ‌కుడు ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన రెడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని..బావోద్వేగానికి లోన‌య్యాడు. 

చాలా ఏండ్ల నుంచి ర‌వికిశోర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ర‌వికిశోర్ ను మా పెద్ద‌న్న‌గా భావిస్తా. మేమిద్ద‌రం క‌లిసి..నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే నువ్వే, నువ్వే కావాలి వంటి బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల‌కు ప‌నిచేశాం. మా ఇద్ద‌రి మ‌ధ్య చాలా గొప్ప అనుబంధం కొన‌సాగుతుంది. ప్రేక్ష‌కులకు మంచి క‌థ‌లు అందించాల‌న్న ర‌వికిశోర్ త‌పన‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. నాకు మంచి అవ‌కాశం ఇచ్చిన కెరీర్ నిర్మాత‌ స్ర‌వంతి రవికిశోర్  ఆయ‌న కో డైరెక్ట‌ర్ లాగా షెడ్యూల్ వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లాగా స్క్రిఫ్ట్ లో త‌ప్పులుంటే దిద్ద‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ తోసిట్టింగ్ జ‌రిగేట‌పుడు డైరెక్ట‌ర్ ప‌క్క‌నే కూర్చొని..దాన్ని ఆనందించ‌డం ఆయ‌న‌కిష్టం.

సినీ ఇండ‌స్ట్రీలో స్క్రిఫ్ట్ ను అంత బ‌లంగా చ‌దివే వ్య‌క్తుల‌ను ఇద్ద‌ర్నే చూశాను. రామానాయుడును చూశాను. త‌ర్వాత మ‌ళ్లీ ర‌వికిశోర్ ను చూశాను. స్క్రిప్ట్ ను వాళ్లు మొద‌టి సీన్ నుంచి చివ‌రి సీన్ దాకా..లొకేష‌న్ లో షాట్ జ‌రుగుతుంటే ఇది సీన్ నంబ‌ర్ ఎంత‌..? ఇది ఎక్క‌డ జ‌రుగుతుంది..ఏ పార్టులో ఉంది కూడా చెప్ప‌గ‌లిగేట‌ట్వంటి వ్య‌క్తులు. అలాంటి వ్యక్తుల‌తో నా కెరీర్ బిగినింగ్ లోనే ప‌నిచేశాను. నేను చాలా అదృష్ట‌వంతుడిని. వాళ్ల ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాను. ఈ సంద‌ర్బంగా ర‌వికిశోర్ కు గౌర‌వంగా పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని బావోద్వేగానికి లోన‌య్యారు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. త్రివిక్ర‌మ్ ఇలా ఒక్క‌సారిగా కాళ్ల‌పై ప‌డేస‌రికి షాక‌య్యారు అక్క‌డున్న‌వారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo