టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమాలు ఎన్టీఆర్, మహేశ్ తో ఉంటాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ అవగానే ఎన్టీఆర్ 30 ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తాడని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టి మహేశ్‌బాబుతో సినిమా చేస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉండగా..సర్కారు వారి పాట మూవీతో మహేశ్‌బాబు తీరిక లేకుండా ఉన్నాడు.
త్రివిక్రమ్ నుంచి నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుందనే దానిపై మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మాటల మాంత్రికుడు తారక్, మహేశ్‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వస్తుండటంతో..ఎవరి ప్రాజెక్టు ముందు సెట్స్ పైకి వెళ్తుందనేదానిపై సస్పెన్స్ నెలకొంది. తాజా అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్, త్రివిక్రమ్ అభిమానుల్లో నెలకొన్న అయోమయానికి ఏప్రిల్ 13న క్లారిటీ రానుందట.