మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 16, 2020 , 06:31:48

భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్  ఎవ‌రో తెలుసా?

నితిన్, ర‌ష్మిక మంధాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ కుడుముల తెర‌కెక్కించిన చిత్రం భీష్మ‌. ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. యూసుఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఫిబ్ర‌వ‌రి 17 సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ని ఛీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. ఇటీవ‌ల అల వైకుంఠ‌వైర‌పులో చిత్రంతో మంచి హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్ నితిన్‌కి అ..ఆ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 


logo