బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 17:06:23

త్రిష టిక్ టాక్ వీడియో.. నెటిజ‌న్స్ ఫిదా

త్రిష టిక్ టాక్ వీడియో.. నెటిజ‌న్స్ ఫిదా

చెన్నై చంద్రం త్రిష ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు చిరు 152వ చిత్రంలో న‌టించే ఛాన్స్ మిస్ చేసుకుంది. మ‌ణిరత్నం పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంతో పాటు ప‌ర‌మ‌ప‌దం విల‌యాట్టు,గ‌ర్జ‌నై, రామ్ త‌దిత‌ర చిత్రాల‌లో న‌టిస్తుంది. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన త్రిష‌.. పెంపుడు జంతువుల‌తో ఆడుకుంటూ స‌మ‌యం దొరికిన‌ప్పుడు ఫ్రెండ్స్‌తో వీడియో చాట్ చేస్తూ స‌మ‌యం గడుపుతుంది.

అయితే సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్స్ ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా  ప్ర‌ముఖ వీడియో మేకింగ్ ప్లాట్ ఫాం టిక్ టాక్‌లోకి అడుగుపెట్టింది.  ప‌లు వీడియోలు చేస్తూ నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది.  హాలీవుడ్ గాయ‌ని మేగాన్ నీ స్టాలియ‌న్ ఆల‌పించిన సేవాజ్‌.. అనే పాట‌కి డ్యాన్స్ చేసి తొలి వీడియోగా దీనిని పోస్ట్ చేసింది. త్రిష డ్యాన్స్ వీడియోకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.

 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo