మంగళవారం 09 మార్చి 2021
Cinema - Jan 16, 2021 , 21:40:18

త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం

త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే  చిత్రం అంకితం

ద‌ర్శ‌కురాలు రేణుకా సహాని   సినిమాల్లో  ప్ర‌ధాన‌ పాత్రలన్నీ స్త్రీల చుట్టూనే తిరుగుతుంటాయి. వాళ్లకు ఉప‌యోగ‌ప‌డేలా ఆమె సినిమాలుంటాయి. స్క్రిప్ట్‌కు అనుగుణంగా  సినిమా చిత్రీక‌ర‌ణ‌లో   ఎక్కడా కాంప్రమైజ్  కాదు.  త‌న సినిమాలు   మహిళా సాధికారికత ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక సినిమాలో  ప్ర‌తీ స‌న్నివేశం కూడా  కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. మహిళల స్వేచ్ఛ గురించి ఎంతోమంది  చెప్పినా కూడా ఇప్పుడు రేణుకా కూడా ఇదే విషయాన్ని సున్నితంగా చెప్పింది. విజయవంతమైన వ్యక్తులు తప్పనిసరిగా సంతోషకరమైన జీవితాలను గడపవలసిన అవసరం లేదు అనే వాస్తవాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. అలాంటి కథనే ఇప్పుడు త్రిభంగాలోనూ చెప్పింది రేణుక. 

ఓ మూడు తరాల కుటుంబం. అందులో తల్లి, కూతురు, మనవరాలు ఉంటారు. అందులో రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నయనతార ఆప్టే (తన్వి అజ్మీ) ఆమె జీవితపు చరమాంకం దశలో ఉంటారు. తన జీవితంలో మంచి కథ రాయాలనే తపనతో.. ఆమె భర్త వినాయక్ (పియూష్ రనాడే)ను, చిన్న పిల్లలను కూడా విడిచిపెడుతుంది. ఆమె తన అత్తగారు మా అజీ (రంజని వెలంకర్) తో కలిసి ఉండదు. కానీ నయనతార కుమార్తె అనురాధ (కాజోల్) కు ఎవరిపై ఆధారపడకుండా.. సొంత మనస్తత్వం కలిగి ఉంటుంది. తనను వదిలేసి వెళ్లిన తల్లిని క్షమించలేదు. దాంతో పాటు చిన్నపుడే తన సవతి తండ్రి విక్రమాదిత్య (నిశాంక్ వర్మ) చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతుంది. ఆ తర్వాత జీవితంలో ఎదిగి ఒడిస్సీ నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాగే తన తల్లి జీవితంలో ఉన్న మరో వ్యక్తి  భక్సర్ రైనా (కన్వాల్జీత్) నృత్యంపై ఈమె మక్కువ చూపిస్తుంది.   అనురాధాకు తన సోదరుడితో ఎక్కడలేని అనుబంధం ఉంటుంది. 

ఆమె సోదరుడు రాబింద్రో (వైభవ్ తత్వవాడి). అదే సమయంలో జీవితంలో తాను చూసిన కొన్ని సంఘటనలతో పెళ్లిపై, ఆ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం కోల్పోతుంది. కానీ ఆమె కూతురు మాషా (మిథిలా పాల్కర్) మాత్రం తల్లి, అమ్మమ్మకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆమెకు మహిళా సాధికారితపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో నయనతార ఆప్టే ఉన్నట్లుండి కోమాలోకి వెళ్లిపోతుంది. అ  సమయంలో ఆమెను మిలన్ ఉపాధ్యాయ (కునాల్ రాయ్ కపూర్) ఆసుపత్రికి తరలిస్తాడు. దాంతో కథ క్లైమాక్స్ ‌కు వస్తుంది. తల్లి హాస్పిటల్‌లో ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి బాధ పడుతుంది అనురాధ. అక్కడ నుండి కథ మొదలవుతుంది. గతం గురించి చర్చించుకుని భవిష్యత్తు గురించి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి సమయంలో వాళ్ల మానసిక పరిపక్వత ఎలా ఉంది.. మహిళలు సొంతంగా ఎలా ఆలోచిస్తారు.. ఉత్తమ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది అసలు కథ.. జీవితంలో మహిళలకు ఎంత బరువైన బాధ్యతలు ఉంటాయి అనేది ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు.

భారీ సినిమాలు నిర్మించే   బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ నుంచి వచ్చిన అందమైన చిన్న చిత్రం ఇది. ఇందులో ఉమెన్ సెంట్రిక్ విషయాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా అంద‌రూ చూడొచ్చు. కాజోల్ సినిమా అంతా నడిపిస్తుంది. ఈమె పాత్ర కథలో మూలంగా ఉంటుంది. తన పాత్రలో చక్కగా నటించింది. అన్ని రకాల ఎమోషన్స్ ఈ పాత్రలో మనకు కనిపిస్తాయి. తన్వి పాత్ర కూడా సినిమాలో అద్భుతంగా ఉంది. నిజానికి ఈమె పాత్రనే సినిమాకు ప్రాణం.   చదువుకున్న పాత్రలో నటించింది. మిథిలా పాల్కర్ పాత్ర కూడా చాలా బాగుంది. కునాల్ రాయ్ కపూర్ కూడా అద్భుతంగా నటించాడు. ఈయన పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సమాజంలో ప్రస్తుతం మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉందనేది అందరికీ తెలుసు. అయినా కూడా కొన్నిచోట్ల ఆడవాళ్లను చులకనగా చూసేవాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్ల కోసమే త్రిభంగా చిత్రం అంకితం.

ఇవీ చదవండి:

సోనూసూద్ టైల‌రింగ్ షాప్‌

రామ్‌ చరణ్‌, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే

ప్రభాస్‌ ‘సలార్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. హీరోయిన్‌.. విలన్‌ ఎవరో తెలుసా?

 సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?

VIDEOS

logo