శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 21, 2021 , 10:47:22

అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజ‌నులు..!

అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజ‌నులు..!

అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనాకు ముందు ఈ చిత్ర షూటింగ్‌ని శేషాచ‌లం అడ‌వుల‌లో ప్లాన్ చేయ‌గా, వైర‌స్ వ‌ల‌న ప్లానింగ్ అంతా మారింది. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలోని  రంపచోడవరం వై.రామవరం మండలాల పరిధిలో ఉన్న  తాళ్లపాలెం కోట పాముబొక్క తదితర గ్రామాల సరిహద్దుల్లోను షూటింగ్ చేస్తున్నారు. గంధ‌పు చెక్క‌ల నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు కాబ‌ట్టి మూవీ షూటింగ్ దాదాపు అటవీ ప్రాంతాల్లోనే చేయ‌నున్నారు‌. 

అయితే చిత్ర యూనిట్ ప్ర‌తి రోజు రంప‌చోడ‌వ‌రం నుండి పందిరిమామిడి మీదుగా కోట గ్రామానికి వెళ్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన 500 మంది గిరిజ‌నులు ఓ రోజు బ‌న్నీ కారుకు అడ్డుప‌డ్డారు. ఆయ‌న‌తో త‌మ గోడు వెళ్ళ‌బుచ్చుకున్నారు. లొకేష‌న్‌కు వ‌స్తే మ‌మ్మ‌ల్ని పంపిచేస్తున్నారు.  మేం మీ అభిమానులం అంటూ వారు త‌మ ఆవేద‌న చెప్పుకునే స‌రికి, బ‌న్నీ కారు టాప్ ఎక్కి వారితో సెల్ఫీలు దిగాడు. అనంత‌రం   కర్పూరంతో హారతులు ఇచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. బన్నీ.. బన్నీ.. అంటూ అరిచారు.  మారుమూల గ్రామంలో త‌మ‌కు ఇంత ఆద‌ర‌ణ, అభిమానం ద‌క్కే సరికి అల్లు అర్జున్ కూడా చాలా సంతోషించారు. 

VIDEOS

logo