శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దమ్మున్నోడు’. బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మిస్తున్నారు. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్న కథానాయికలుగా నటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘మాస్ యాక్షన్ అంశాలతో సాగే శక్తివంతమైన కథాంశమిది. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం. ఏడు భారీ ఫైట్స్, నాలుగు పాటలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది’ అని తెలిపారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎమ్ ప్రేమ్.