గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 16:51:14

న్యాయం అపహాస్యమైంది.. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు రియాను వేధించాయి..

న్యాయం అపహాస్యమైంది.. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు రియాను వేధించాయి..

ముంబై: సుశాంత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేయడంపై ఆమె తరుఫు న్యాయవాది సతీష్ మనషిండే స్పందించారు. న్యాయం అపహాస్యమైందని ఆయన అన్నారు. మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఒంటరి మహిళ అయిన రియాను వేధింపులకు గురిచేశాయని ఆరోపించారు. అనేక ఏండ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చట్టవిరుద్ధంగా ఇచ్చిన మందులు సేవించి ఆత్మహత్య చేసుకున్న డ్రగ్స్‌కు బానిస అయిన వ్యక్తి (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్)ని ప్రేమించడమే ఆమె చేసిన తప్పని అన్నారు. అందుకే మూడు దర్యాప్తు సంస్థలు రియాను వెంటాడి వేధించాయని, చివరకు ఆమెను అరెస్ట్ చేశారని న్యాయవాది సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతామని ఆయన చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo