శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 00:05:08

మహా సముద్రంలో ప్రయాణం

మహా సముద్రంలో ప్రయాణం

తెలుగులో అగ్ర హీరోలతో జోడీకట్టిన అను ఇమ్మాన్యుయేల్‌కు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఆమె నటించిన  సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేకపోవడంతో రెండేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరమైంది ఈ సొగసరి. ఇటీవలే తెలుగులో పునరాగమనం చేసిన అను ఇమ్మాన్యుయేల్‌ కథాబలమున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నది. తాజాగా ఆమె చక్కటి అవకాశాన్ని సొంతం చేసుకున్నది. శర్వానంద్‌, సిద్దార్థ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘మహాసముద్రం’. అజయ్‌భూపతి దర్శకుడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించనున్నది. నటనకు ప్రాధాన్యమున్న  పాత్ర కోసం ఆమెను ఎంపికచేసినట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ప్రేమ, యాక్షన్‌, భావోద్వేగాల కలబోతగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అదితీరావ్‌ హైదరీ మరో నాయికగా నటించనుంది. ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.