శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 20:30:01

నటిగా ప్రూవ్ చేసుకోవాలంటున్న టాప్ యాంక‌ర్‌..!

నటిగా ప్రూవ్ చేసుకోవాలంటున్న టాప్ యాంక‌ర్‌..!

శ్రీముఖి..టాప్ తెలుగు యాంక‌ర్ల‌లో ఒక‌ర‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఓ వైపు యాంక‌రింగ్ చేస్తూనే మ‌రోవైపు సినిమాల్లో కూడా త‌న స‌త్తా చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా..స‌రైన హిట్టు ప‌డ‌టం లేదు. టీవీ షోలు కొన‌సాగిస్తూనే త‌న కెరీర్ ను గాడిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటుంద‌ట‌. త‌న న‌ట‌నామెల‌కుల‌వ‌లు మ‌రింత ప‌ద‌నుపెడుతూ వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్స్ తోపాటు డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో ప‌లు ప్రాజెక్టులు చేయాల‌నుకుంటున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. శ్రీముఖి న‌టించిన ఓ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

అయితే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఎదురుచూస్తుంద‌ట. ఒక్క మంచి సినిమాకానీ, మంచి పాత్ర గానీ చేసే అవ‌కాశమొస్తే చాలు శ్రీముఖి త‌న యాక్టింగ్ తో అంద‌రినీ అల‌రించ‌డం ఖాయం. ఇప్ప‌టికైనా శ్రీముఖికి మంచి బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నారు ఫాలోవ‌ర్లు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.