మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 17:14:25

‘చిట్టిబాబు’ త‌ర‌హా రోల్ లో మ‌రో యువ హీరో..!

‘చిట్టిబాబు’ త‌ర‌హా రోల్ లో మ‌రో యువ హీరో..!

నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్ బాబు న‌టించిన తీరుకు 100 శాతం మార్కులు ప‌డిన‌ట్టే. ల‌వ‌ర్ బాయ్ రోల్స్ లో క‌నిపించిన ఈ యాక్ట‌ర్ ‘వి’ మూవీతో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మారేందుకు అర్హ‌త సాధించిన‌ట్టేనంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఇపుడీ హీరో గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ప‌‌లాస ఫేం క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ ప్రాజెక్టులో సుధీర్‌బాబు పాత్ర రంగ‌స్థ‌లంలో రాంచ‌ర‌ణ్ పోషించిన చిట్టిబాబు రోల్ త‌ర‌హాలో సాగుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

వింటేజ్ (పురాత‌న కాలం) బ్యాక్ డ్రాప్ లో భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. క‌రుణ కుమార్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా కోసం ఓ సినిమా చేయ‌గా..ఆశించిన ఫలితాన్నివ్వ‌లేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo