బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 14:57:20

రెట్రో లుక్ లో యువ న‌టుడు..ట్రెండ్ అవుతున్న స్టిల్‌

రెట్రో లుక్ లో యువ న‌టుడు..ట్రెండ్ అవుతున్న స్టిల్‌

అల్లుడు శ్రీను చిత్రంతో త‌న జ‌ర్నీ మొద‌లు పెట్టి విజ‌య‌వంతంగా కెరీర్ ను కొన‌సాగిస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ యువ హీరో ప్ర‌స్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న‌ అల్లుడు అదుర్స్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ యాక్ట‌ర్ మునుపెన్న‌డూ లేని లుక్ లో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు. కోర‌మీసాల‌ను మెలితిప్పుతూ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని డిఫెరెంట్ గా రెట్రో లుక్ లో క‌నిపిస్తున్న ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బెల్లంకొండ లేటెస్ట్ స్టిల్ 1970-80 బ్యాక్ డ్రాప్ ను గుర్తుచేస్తుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో అల్లుడు అదుర్స్ షూటింగ్ కొన‌సాగుతోంది. 

ఈ మూవీలో సోనూసూద్‌, ప్ర‌కాశ్ రాజ్‌, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర ఎంట‌ర్ టైనింగ్ గా సాగనున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. 2021 లో సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo