బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 16:19:29

యువ హీరో హార్స్‌రైడింగ్ ఫొటో చ‌క్క‌ర్లు

యువ హీరో హార్స్‌రైడింగ్ ఫొటో చ‌క్క‌ర్లు

టాలీవుడ్ యువన‌టుడు అక్కినేని అఖిల్ వీకెండ్ ను స‌రిగ్గా ఉప‌యోగించుకున్నాడు. వీకెండ్ లో నూత‌నోత్సాహం నిం‌పుకునేందుకు అఖిల్‌ హార్స్ రైడింగ్ చేశాడు. గుర్రంపై కూర్చున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అఖిల్‌.. 'నా ప్రియ‌మైన గిజిల్లేతో స‌న్ డే స‌వారీ. గిజిల్లే నా కాలి మీద నిల‌బ‌డేలా చేసింది. అంతేకాదు నాకు చాలా ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇది ఎంత మంచి థెర‌పాటిక్ (చికిత్స‌)గా ప‌నిచేసిందే నేను వివ‌రించ‌లేను. తాజా ఆలోచ‌నలు, నూత‌నోత్సాహంతో వారాన్ని షురూ చేసేందుకు నాకు మ‌రింత శ‌క్తినిచ్చింది. యాక్టివ్ స‌న్ డే ఛీర్స్ ' అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. 

హార్స్ రైడింగ్ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అఖిల్ ప్ర‌స్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఫన్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ మూవీకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo