గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 19:37:52

ఈవీవీని ఫాలో అవుతున్న యువ ద‌ర్శ‌కుడు

ఈవీవీని ఫాలో అవుతున్న యువ ద‌ర్శ‌కుడు

ప‌టాస్ చిత్రంతో మంచి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఆ త‌ర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్‌, సుప్రీమ్‌, ఎఫ్-2, స‌‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు చేశాడు. ప్ర‌స్తుతం ఎఫ్ 3 సినిమా సీక్వెల్ కు స్క్రిఫ్ట్ రెడీ చేసినా..క‌రోనా ఎఫెక్ట్, హీరోల బిజీ షెడ్యూల్ వ‌ల్ల సెట్స్ పైకి వెళ్లేందుకు టైం ప‌ట్ట‌నుంది. అల‌నాటి ద‌ర్శ‌కుడు ఇవీవీ స‌త్య‌నారాయ‌ణ తక్కువ బ‌డ్జెట్ తో తీసిన చాలా చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద హిట్ టాక్ ను తెచ్చుకోవ‌డమే కాకుండా..మంచి క‌లెక్ష‌న్ల ను కూడా రాబ‌ట్టాయి. 

అయితే అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్ ఇవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను ఫాలో అవ్వాల‌నుకుంటున్నాడ‌ట‌. అనిల్ రావిపూడి ఇవీవీ బాటలోనే ప‌య‌నించి త‌క్కువ బ‌డ్జెట్ తో వినోదాత్మ‌క సినిమాలు చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అయితే అనిల్ రావిపూడి తీయాల‌నుకుంటోన్న లో బడ్జెట్ మూవీలో ఏ హీరో న‌టిస్తాడ‌నేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo