గురువారం 04 జూన్ 2020
Cinema - May 24, 2020 , 07:20:06

థియేట‌ర్స్ తెరిచే విష‌యంపై కిష‌న్ రెడ్డి క్లారిటీ..!

థియేట‌ర్స్ తెరిచే విష‌యంపై కిష‌న్ రెడ్డి క్లారిటీ..!

దాదాపు 60 రోజులుగా మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ త్వ‌ర‌లోనే తెరుచుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు కేసీఆర్‌ని క‌లిసి షూటింగ్స్‌, థియేట‌ర్స్ రీ ఓపెన్ విష‌యంపై చ‌ర్చించారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ఇక  తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా కొంద‌రు సినీ పెద్ద‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడి వారికి శుభ‌వార్త అందించారు.

టాలీవుడ్‌ పరిశ్రమకి సంబంధిచి సురేష్‌ బబు, తేజ, జెమిని కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్ , దాము కానూరి, అభిషేక్ అగర్వాల్‌, శరత్‌, ప్రశాంత్‌ రవి తదితరులు టాలీవుడ్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ..థియేటర్స్‌ అన్నీ ఒకే రోజు తెరుచుకునేలా ప్రణాళికలు చేస్తున్నాం. షూటింగ్‌లకి కూడా త్వరలోనే అనుమతి లభిస్తుంది. 

దేశంలో ఎక్కడైన షూటింగ్‌లు, స్టూడియోలు నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఆయా సీఎంలతో చర్చిస్తాం. తెలుగు, తమిళం, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలపై చర్చిద్ధాం.రీజినల్‌ జీఎస్టీ గురించి కూడా ఆలోచిస్తాం. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా, పైరసీని అరికట్టేలా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. logo