తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్పీ మ్యూజిక్’ పేరుతో సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ ‘సంగీతం సినిమాకు హృదయం లాంటిది. అందుకే సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. మా సంస్థ వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్తూ ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌ను నాణ్యమైన సంగీతానికి చిరునామాగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అలాగే సంగీత పరిశ్రమకు కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.