శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 21:31:20

రీమేక్స్ జోలికి వెళ్ల‌ని టాలీవుడ్ హీరోలు వీళ్లే

రీమేక్స్ జోలికి వెళ్ల‌ని టాలీవుడ్ హీరోలు వీళ్లే

రీమేక్ సినిమాలు చేయడం అనేది ఇప్పుడు కామన్. ఎందుకంటే ఓ భాషలో నచ్చిన సినిమాలను మరో భాషలోకి తీసుకెళ్లడం అనేది చాలా మంది హీరోలకు నచ్చిన విషయమే. పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు.. పైగా సేఫ్ జోన్ లో కూడా ఉంటారు. కథ ఆల్రెడీ హిట్ అయ్యుంటుంది కాబట్టి రిస్క్ ఉండదు. ఇన్ని లాభాలున్నా కూడా కొందరు హీరోలు మాత్రం రీమేక్ సినిమాల వైపు అస్సలు వెళ్లలేదు.. కనీసం చూడలేదు. అలాంటి హీరోలెవరో చూద్దాం.. 

మహేష్ బాబు: రీమేక్ సినిమా అంటేనే కిలోమీటర్ దూరం పారిపోయే హీరో మహేష్ బాబు. అసలు ఆ వైపు ఆలోచించడు కూడా. కెరీర్ మొదలు పెట్టి 20 ఏళ్లైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రీమేక్ వైపు అడుగేయలేదు మహేష్ బాబు. తాను రీమేక్స్‌కు దూరం అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాడు సూపర్ స్టార్. 

అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ కూడా ఇప్పటి వరకు రీమేక్ సినిమాలు చేయలేదు. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా అదే నిజం. ధృవ లాంటి సినిమాలు ఆఫర్ వచ్చినా కూడా అది చేయలేకపోయాడు బన్నీ.

సాయి ధరమ్ తేజ్: మెగా హీరోలు చాలా వరకు రీమేక్ సినిమాలు చేయడానికి యిష్టపడుతుంటారు. వరుణ్, పవన్, చిరంజీవి లాంటి వాళ్లు రీమేక్ సినిమాలు చేసారు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పటి వరకు రీమేక్ వైపు వెళ్లలేదు. హిట్స్ అయినా.. ప్లాప్ అయినా సొంత కథలే చూసుకుంటున్నాడు. 

విజయ్ దేవరకొండ: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సైతం పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సంచలన సినిమాలు చేసాడు కానీ రీమేక్స్ అయితే చేయలేదు. పైగా ఈయన సినిమాలనే పక్క భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

రానా: ఇప్పటి వరకు పదేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా రీమేక్ సినిమాలు చేయలేదు దగ్గుబాటి వారసుడు రానా. బెంగళూర్ డేస్ తమిళ రీమేక్ బెంగళూర్ నాట్కల్‌లో నటించాడు కానీ తెలుగులో అది రిలీజ్ కాలేదు.

శ్రీ విష్ణు: తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తాడనే పేరున్న శ్రీ విష్ణు కూడా రీమేక్స్ జోలికి పోలేదు.

అఖిల్: పాతికేళ్ళ కింద ఏడాది వయసులో ఉన్నపుడు సిసింద్రీ సినిమాలో నటించాడు అఖిల్ అక్కినేని. ఈ సినిమా ఇంగ్లీష్ సినిమాకు రీమేక్. కానీ హీరో అయిన తర్వాత మాత్రం అఖిల్ రీమేక్స్‌కు దూరంగానే ఉంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.