శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 16:01:18

వివేక్ ఆత్రేయ మాట త‌ప్పాడా..? చిక్కుల్లో 'అంటే సుంద‌రానికి '..!

వివేక్ ఆత్రేయ మాట త‌ప్పాడా..? చిక్కుల్లో 'అంటే సుంద‌రానికి '..!

ప్ర‌స్తుతం ట‌క్‌జ‌గ‌దీష్ చిత్రంతో  బిజీగా ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ప్రాజెక్టు త‌ర్వాత వివేక్ ఆత్రేయతో చేస్తున్న‌ అంటే సుంద‌రానికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఈ మూవీ చిక్కుల్లో ప‌డిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. పెళ్లి చూపులు, మెంట‌ల్ మ‌దిలో చిత్రాల నిర్మాత రాజ్‌కందుకూరి ఈ చిత్రంపై ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం..ఈ చిత్రాన్ని తానే నిర్మించాల్సి ఉండ‌గా..వివేక్ ఆత్రేయ ఇపుడు మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సినిమా చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విష‌య‌మేంటంటే..మెంట‌ల్ మ‌దిలో చిత్రంతో వివేక్ ఆత్రేయ‌ను రాజ్ కందుకూరి డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. అయితే త‌ర్వాత చేయ‌నున్న సినిమాను త‌న సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ‌ప‌త క్రియేష‌న్స్ లో చేయాల‌ని వివేక్ ఆత్ర‌యతో రాజ్‌కందుకూరి ఒప్పందం చేసుకున్నార‌ట‌. కానీ వివేక్ ఆత్రేయ త‌న రెండో చిత్రం బ్రోచేవారెవ‌రురా బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వివేక్ ఆత్రేయకు పెద్ద నిర్మాణ సంస్థ‌లను ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.

వెంట‌నే మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి అంటే సుంద‌రానికి సినిమా చేస్తున్నాడీ డైరెక్ట‌ర్. ఈ సారి కూడా ఇచ్చిన మాట త‌ప్పి త‌న‌తో సినిమా చేయ‌లేద‌ని రాజ్‌కందుకూరి త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు టాక్‌. నాని సినిమా సెట్స్ పైకి వెళ్లేకంటే ముందే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని నిర్మాత రాజ్‌కందుకూరి ప‌ట్టుబ‌ట్ట‌గా..ప‌లువురు పెద్దలు ఈ వివాదానికి ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 

ఇవి కూడా చ‌ద‌వండి..

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo