శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 16:06:58

స్టార్ హీరో ఒడిలో కూతురు..ఫొటో వైర‌ల్

స్టార్ హీరో ఒడిలో కూతురు..ఫొటో వైర‌ల్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూతురు సితార సోష‌ల్ మీడియాలో ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సితార ఎప్ప‌టిక‌పుడు ఏదో ఒక ఫొటోతో నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. సితార తాజాగా తన తండ్రి మ‌హేశ్ బాబు ఒడిలో హాయిగా సేద క‌నుకు తీస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మ‌హేశ్ అండ్ ఫ్యామిలీ హాలీడే ట్రిప్ కు విదేశాల‌కు వెళ్లిన‌ స‌మయంలో మ‌హేశ్ బాబు ఎయిర్ పోర్టు లాంజ్ సోఫా ఛైర్ లో కూర్చున్నపుడు సితార మ‌హేశ్‌పై వాలి హాయిగా నిద్ర‌పోయింది. విశ్రాంతి తీసుకునేందుకు ఇంత క‌న్నా మంచి ప్ర‌దేశం లేదు. నాన్న యు ఆర్ ది బెస్ట్‌..అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం ప‌రశురాం డైరెక్ష‌న్ లో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. క‌థానుగుణంగా యూఎస్ లో బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే కొన్ని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం లొకేషన్ల వేటలో ప‌ర‌శురాం టీం ఉన్న‌ట్టు టాక్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.