శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 18:44:04

ఇన్నాళ్ల‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి..!

ఇన్నాళ్ల‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రి సితార ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం. ఎందుకంటే టాలెంట్ ఉన్న నటీన‌టులు ఎంత‌మంది ఉన్నా అంద‌రికీ అవ‌కాశాలు రాని ప‌రిస్థితి. కొంద‌రికైతే చాలా సినిమాల్లో న‌టించినా గుర్తింపు రాదు. కానీ మంచి పాత్రలో న‌టించే అవ‌కాశం వ‌స్తే మాత్రం వారి స్టార్ మారిన‌ట్టే. అలాంటి కోవ‌లోకే వ‌స్తారు సీనియ‌ర్ న‌టుడు గోప‌రాజు ర‌మ‌ణ‌. ఇటీవ‌లే విడుద‌ల అయిన మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ తండ్రి పాత్ర‌లో న‌టించారు గోప‌రాజు ర‌మ‌ణ‌. ప‌లు చిత్రాల్లో న‌టించిన ఆయ‌న‌కు ఈ సినిమాలో పోషించిన పాత్ర‌కు ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

సుదీర్ఘ కాలంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న గోప‌రాజు ర‌మ‌ణ‌కు ఈ చిత్రంతో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న ఆయ‌న‌కు ఈ సినిమాతో ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డుతున్నాయ‌ట‌. మొత్తానికి ఈ వ‌య‌స్సులోనైనా గోప‌రాజు ర‌మ‌ణ‌కు మంచి గుర్తింపు రావ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం అంటున్నారు సినీ జ‌నాలు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.