శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 19:19:03

షూటింగ్‌కు రామ్ చరణ్ బ్రేక్..అసలు కారణం అదేనా..?

షూటింగ్‌కు రామ్ చరణ్ బ్రేక్..అసలు కారణం అదేనా..?

మొన్నటి వరకు కూడా ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. 50 రోజుల భారీ షెడ్యూల్ కూడా తాజాగా పూర్తి చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పూర్తైనట్లు ప్రకటించారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు షూటింగ్ నుంచి వారం రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాడు రామ్ చరణ్. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లొచ్చాడు. అక్కడే వారం రోజులు గడిపిన తర్వాత ఇండియాకు వచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా కొన్ని రోజులు బ్రేక్ కావాలంటున్నాడు. 

అయితే ఎన్టీఆర్ మాదిరి బయటికి వెళ్లడానికి కాదు వ్యక్తిగత కారణాలతో బ్రేక్ కావాలని రాజమౌళికి అర్జీ పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఆ పర్సనల్ రీజన్ ఏంటో అందరికీ తెలుసు. డిసెంబర్ 9న రామ్ చరణ్ చెల్లెలు నిహారిక పెళ్లి. రాజస్థాన్ ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా నిహారిక పెళ్లి వేడుకలు జరగనున్నాయి. దీనికి ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే రానున్నారు. ప్యాండమిక్ కావడంతో ఎవరికీ పత్రికలు అయితే అందలేదనే తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత.. పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక పెద్ద పార్టీ చేసుకుందామని మెగా కుటుంబ సభ్యులు అందరికీ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

పెళ్లికి మాత్రం చాలా తక్కువ మంది హాజరు కానున్నారు. మెగా కుటుంబంతో పాటు అబ్బాయి తరఫు బంధువులు కూడా అతి తక్కువ సంఖ్యలోనే రానున్నారు. ఈ పెళ్లి వేడుక కోసమే వారం రోజులకు పైగా రామ్ చరణ్ సెలవు కోరినట్లు తెలుస్తుంది. రాజమౌళి కూడా దీనికి అనుమతి ఇచ్చేసాడు. డిసెంబర్ 9నే పెళ్లి కావడంతో అన్నగా చేయాల్సిన బాధ్యతలు అన్నీ దగ్గరుండి చేస్తున్నాడు రామ్ చరణ్. మరోవైపు వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.