గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 21:39:37

డెనిమ్ జాకెట్ ఉండాల్సిందే..ర‌కుల్ ఫొటోలు వైర‌ల్‌

డెనిమ్ జాకెట్ ఉండాల్సిందే..ర‌కుల్ ఫొటోలు వైర‌ల్‌

ర‌కుల్ ప్రీత్ సింగ్..తెలుగు, తమిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. త‌క్కువ టైంలోనే ఆయా భాష‌ల్లో స్టార్ హీరోల‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా తార‌ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది ర‌కుల్. సొంతంగా జిమ్ సెంట‌ర్స్ మెయింటైన్ చేస్తోన్న ర‌కుల్ జిమ్ వేర్‌తోపాటు ట్రెండీ వేర్ లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంటుంది.  ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ జీరో సైజ్ ఫిజిక్ లో క‌నిపిస్తుంటుంది.

తాజాగా డెనిమ్ దుస్తుల్లో ఉన్న‌పుడు క్లిక్ మ‌నిపించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. వెకేష‌న్ కు వెళ్లిన‌పుడు, షాపింగ్ కు వెళ్లిన‌పుడు, రెస్టారెంట్‌కు స్నేహితుల‌తో క‌లిసి వెళ్లిన‌పుడు డెనిమ్ ష‌ర్టులో మెరుస్తూ అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంటోంది.