శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 07:46:13

ఇవాళ ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న ర‌కుల్‌

ఇవాళ ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న ర‌కుల్‌

ముంబై: బాలీ‌వుడ్ ను డ్రగ్స్‌ వ్యవ‌హారం కుది‌పే‌స్తు‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచా‌రణ కోసం టాలీవుడ్‌ నటి రకు‌ల్‌‌ప్రీత్‌ సింగ్‌ నార్కో‌టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎ‌న్‌‌సీబీ) ఎదుట గురు‌వారం హాజ‌రు‌కా‌వాల్సి ఉంది. అయితే ఎన్‌‌సీబీ నుంచి తమకు ఎలాంటి సమన్లు అంద‌లే‌దని, అందు‌వల్ల విచా‌ర‌ణకు హాజ‌రు‌కా‌వ‌డం‌లే‌దని తెలి‌య‌జేస్తూ, ర‌కుల్ ప్రీత్ సింగ్ లీగల్‌ టీం గురు‌వారం ఓ ప్రక‌టన విడు‌దల చేసింది. అయితే, ఆ తర్వాత తనకి ఎన్సీబీ నుంచి సమన్లు అందా‌యని, శుక్ర‌వారం విచా‌ర‌ణకు హాజ‌ర‌వు‌తా‌నని రకుల్‌ పేర్కొ‌న్నారు. ఈ మేరకు ఎన్‌‌సీ‌బీకి ఆమె సమా‌చా‌ర‌మి‌చ్చి‌నట్టు జాతీయ మీడియా తెలి‌పింది. ఈ మేర‌కు ర‌కుల్ ఇవాళ ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. 

మ‌రోవైపు బాలీ‌వుడ్‌ హీరో‌యిన్‌ దీపికా పదు‌కొనె శుక్ర‌వారం ఎన్సీబీ ఎదుట హాజ‌ర‌వ్వాల్సి ఉండ‌గా..  శని‌వారం విచా‌ర‌ణకు హాజ‌ర‌వు‌తా‌నని తెలి‌పారు. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నమరో నటి సారా అలీ‌ఖాన్‌ కూడా శని‌వారం విచా‌ర‌ణకు హాజ‌రు‌కా‌ను‌న్నారు. logo