శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 17:48:40

పుకార్ల‌ను కొట్టిపారేసిన ర‌కుల్ మేనేజ‌ర్‌..!

పుకార్ల‌ను కొట్టిపారేసిన ర‌కుల్ మేనేజ‌ర్‌..!

టాలీవుడ్ యాక్ట‌ర్ మోహ‌న్‌బాబు స‌న్ ఆఫ్ ఇండియా షూటింగ్ ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంద‌ని ఓ ఆస‌క్తిక‌ర వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై ర‌కుల్ మేనేజ‌ర్ ఈ వార్త‌ల‌ను కొట్టిపారేస్తూ క్లారిటీ ఇచ్చాడు. ర‌కుల్ ఈ సినిమాలో న‌టించ‌డం లేద‌ని, ప్ర‌స్తుతానికి ఆమె త‌న కొత్త చిత్రాల‌తో బిజీగా ఉంద‌ని తెలిపాడు.

స‌న్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం నితిన్ తో చెక్ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు క్రిష్‌-వైష్ణ‌వ్‌తేజ్ సినిమాలో కూడా న‌టిస్తోంది. దీంతోపాటు అర్జున్ క‌పూర్ తో ఓ సినిమా చేస్తోంది. జాన్ అబ్ర‌హాం, అజ‌య్ దేవ్‌గ‌న్ తో కూడా సినిమాలు చేసే అవ‌కాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.