శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 16:06:56

బాలీవుడ్ హీరోయిన్లంటే భ‌య‌ప‌డుతున్న నిర్మాతలు..!

బాలీవుడ్ హీరోయిన్లంటే భ‌య‌ప‌డుతున్న నిర్మాతలు..!

ఇప్ప‌టికే చాలా మంది టాలీవుడ్ నిర్మాత‌లు మార్కెట్ కు అనుగుణంగా బాలీవుడ్ హీరోయిన్ల‌ను త‌మ సినిమాల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్ లోకి తెలుగు సినిమాలు వెళ్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఇప్ప‌టికే  బాలీవుడ్ హీరోయిన్లు శ్ర‌ద్దాక‌పూర్, దీపికా ప‌దుకొనే, అలియా భ‌ట్ త‌మ ప్రాజెక్టులో పెట్టుకున్నాయి. మ‌రోవైపు పూరీ జ‌గ‌న్నాథ్-విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో అన‌న్య‌పాండే పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే టాలీవుడ్ నిర్మాత‌లు ప‌లు సినిమాల కోసం జాన్వీక‌పూర్, సారా అలీఖాన్ ను సంప్ర‌దించా‌రు. అయితే ఇపుడు మాత్రం ప్రొడ్యూస‌ర్స్ బాలీవుడ్ హీరోయిన్లంటే భ‌య‌ప‌డే ప‌రిస్తితి నెల‌కొన్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ లింక్స్ బ‌య‌టప‌డుతుండ‌టంతో ఎన్సీబీ అధికారులు ఇప్ప‌టికే ర‌కుల్ ప్రీత్ సింగ్‌, శ్ర‌ద్దాక‌పూర్‌, సారా అలీఖాన్, దీపికాద‌పదుకొనేల‌కు స‌మ‌న్లు జారీచేసి విచారించారు. అలియాభ‌ట్ పై ఇప్ప‌టికే నెటిజ‌న్లు ట్రోల్స్ కూడా చేశారు. ఎన్‌సీబీ స‌మ‌న్లు, విచార‌ణ నేప‌థ్యంలో టాలీవుడ్ నిర్మాత‌లు ఇక నుంచి కొంత కాలం బాలీవుడ్ హీరోయిన్ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారట‌. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌రో ఏడాది కానీ, రెండేళ్లు కానీ తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్ల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.