గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 15:19:09

మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న ప్ర‌ముఖ నిర్మాత‌..!

మ‌ల్టీస్టార‌ర్‌కు ప్లాన్ చేస్తున్న ప్ర‌ముఖ నిర్మాత‌..!

నాని, రానా మంచి స్నేహితుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కోట్లాదిమంది ఫాలోవ‌ర్లున్న ఈ ఇద్ద‌రి అభిరుచులు కాస్త ద‌గ్గ‌రిగా ఉంటాయి. అయితే ఈ ఇద్ద‌రు సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిస్తే ఎలా ఉంటుంది..? అవును ఫిలింన‌గ‌ర్ లో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ముఖ నిర్మాత ఈ ఇద్ద‌రు న‌టుల‌తో క‌లిసి మల్టీస్టార‌ర్ ను తెర‌కెక్చించాల‌ని భావిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్న ఈ సినిమా కోసం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ స్ర్కిప్ట్ ను సిద్దం చేసే ప‌నిలో ఉన్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమ రానున్న‌ట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మరి ఓ వైపు న్యాచుర్ స్టార్ నాని, మ‌రోవైపు బాహుబ‌లిలో భ‌ల్లాల దేవ‌గా అల‌రించిన రానా కాంబినేష‌న్ సినిమా అనేస‌రికి తెగ ఎక్స‌యిటింగ్ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మ‌రి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడొస్తుందో చూడాలి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo