శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 26, 2020 , 18:33:13

యువ న‌టుడి డిమాండ్ కు నిర్మాత‌ షాక్..!

యువ న‌టుడి డిమాండ్ కు నిర్మాత‌ షాక్..!

టాలీవుడ్ యువ న‌టుడు వ‌రుణ్ తేజ్ సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో కూడిన క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తాడ‌నే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హ‌రీష్ శంక‌ర్ తో తీసిన గ‌ద్ద‌ల కొండ గణేశ్ వ‌రుణ్ తేజ్ ఇమేజ్ ను పెంచేసింది. అయితే గ‌తంలో రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌క్కువ‌గానే తీసుకున్న ఈ యాక్ట‌ర్ ఇపుడు పెట్టిన డిమాండ్ మాత్రం నిర్మాత‌ను షాక్ కు గురిచేస్తోంద‌ట‌. వరుణ్ తేజ్ ఎఫ్ 2 చిత్రాన్ని చేసిన దిల్ రాజు మ‌రోసారి ఎఫ్‌3కి కూడా ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోలాగా కాకుండా ఈ సారి మాత్రం భారీగానే పారితోషికాన్ని అడిగిన‌ట్టు టాక్ న‌డుస్తోంది.

త‌న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వ‌రుణ్ తేజ్ రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేస్తున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్ర‌స్తుతం సాయి కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమాలో న‌టిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo