శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 11:19:20

క‌రోనా కాటుతో తెలుగు నిర్మాత మృతి

క‌రోనా కాటుతో తెలుగు నిర్మాత మృతి

ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా ప్ర‌జ‌ల జీవితాల‌ని చిన్నాభిన్నం చేసింది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న ఎందరో మృత్యువాత చెందుతున్నారు. సెల‌బ్రిటీలు కూడా ఇందుకు అతీతులేమి కాదు. క‌రోనా వ‌ల‌న ఈ రోజు ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు(64)  క‌న్నుమూశారు. ఈత‌రం ఫిలింస్ పోకూరి బాబూరావు సోద‌రుడే పోకూరి రామారావు. ఈత‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్రాల‌కు ఈయ‌న చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ఈ తరం బ్యానర్ లో తెరకెక్కాయి  

క‌రోనాతో కొద్ది రోజులుగా పోకూరి రామారావు  హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు . ఆయ‌న మృతికి టాలీవుడ్ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. దేశంలో కరోనా విజృంభిస్తుండ‌డంతో ఈ రోజు రికార్డు స్థాయిలో 22 వేలకుపైగా  నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో 22,771 మంది కరోనా పాజిటివ్‌లుగా తేలారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,48,315కు చేరింది.  కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 18,655కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo