ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 16:22:42

స్టోరీ రైట‌ర్ గా మారిన దిల్ రాజు స‌తీమ‌ణి.!

స్టోరీ రైట‌ర్ గా మారిన దిల్ రాజు స‌తీమ‌ణి.!

టాలీవుడ్ నిర్మాత‌ల్లో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సిన పేరు దిల్ రాజు. ఎందుకంటే ఓ సినిమాకు క‌థ ఎంత ముఖ్య‌మో..ఆ క‌థను జ‌నాలు ఎంత‌వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారో అంచ‌నా వేయ‌గ‌ల నిర్మాత దిల్ రాజు‌. ప్ర‌స్తుతం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి క‌థ‌ల కొర‌త ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. లాక్ డౌన్ త‌ర్వాత ఓటీటీ ప్లాట్ ఫాంల హ‌వా న‌డుస్తుండ‌టంతో భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో రానున్న కాలంలో డిజిట‌ల్ కంటెంట్ కు డిమాండ్ పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుత ట్రెండ్ కు అనుగుణంగా మంచి క‌థ‌ల వేట‌లో ప‌డ్డారు నిర్మాత‌లు. అయితే ఈ విష‌యంలో దిల్ రాజుకు కొంత మిన‌హాయింపునివ్వొచ్చు.

దిల్ రాజు ఇంటి వ్య‌క్తే క‌థ‌లు సిద్దం చేసే ప‌నిలో ప‌డిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే క‌దా మీ డౌటు. దిల్‌రాజు స‌తీమ‌ణి తేజ‌స్విని. ఇన్నోవేటివ్ స్టోరీలైన్ ను దిల్ రాజుకు తేజ‌స్విని చెప్ప‌గా ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఇదే స్టోరీలైన్ ను రైట‌ర్స్ టీంకు అప్ప‌గించి ఐడియాను డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నాడ‌ట‌. అంతేకాదు స్టోరీ ఫైన‌ల్ అయ్యాక డైరెక్ట‌ర్, న‌టీన‌టుల‌ను కూడా ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇక నుంచి దిల్ రాజు ఇంటి నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి మ‌రో వ్య‌క్తి చేరిపోయిన‌ట్టేన‌న్న‌మాట‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.