శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 21:13:45

ముగ్గురికి రూ.30 కోట్లు రెమ్యున‌రేష‌న్‌..?

ముగ్గురికి రూ.30 కోట్లు రెమ్యున‌రేష‌న్‌..?

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు-అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం ఎఫ్2. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా విడుద‌లై..దిల్ రాజుకు కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే ఎఫ్2కు బ‌డ్జెట్ త‌క్కువ‌వ‌డం, క‌లెక్ష‌న్లు ఎక్కువ‌గా రావ‌డంతో లాభాలు వచ్చాయి. కానీ దీనికి సీక్వెల్ ఎఫ్3 విష‌యంలో రివ‌ర్స్ అయ్యే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఈ చిత్రం కోసం వెంకీకి రూ.6 కోట్లు, వ‌రుణ్ కు రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన దిల్ రాజు ఇపుడు మాత్రం భారీగానే ముట్ట‌జెప్పుతున్నాడ‌ట‌.

ఎఫ్ 3 కోసం వెంక‌టేశ్ రూ.10 కోట్లు ఇస్తుండ‌గా..వ‌రుణ్ తేజ్ కూడా అంతే స‌మానంగా డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్‌. మ‌రోవైపు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ సారి త‌న రేంజ్ పెంచుకుని వారితో స‌మానంగా రూ.10 కోట్లు పారితోషికం ఇవ్వాల‌ని అడిగార‌ట‌. త్వ‌ర‌లో షూటింగ్ కావాల్సి ఉండ‌టంతో ఇక చేసేదేమి లేక దిల్ రాజు ఈ ముగ్గురి కోసం రూ.30 కోట్లు వెచ్చించిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. కరోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ తో సినిమా చేస్తే ఎంత‌వ‌ర‌కు క‌లెక్ష‌న్లు వ‌స్తాయో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.