తెలుగు ఇండస్ట్రీలో రాజకీయాలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఆటు సినిమాలు..ఇటు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మరికొందరు రాజకీయాలు ఇక చాలు అనుకొని సినిమాలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు మాత్రం అటు ఇటు చూస్తున్నారు. ఈయన భక్తుడు బండ్ల గణేష్ కూడా రాజకీయాల వైపు ఒక చూపు చూశాడు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి నానా హంగామా చేశాడు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకుంటానంటూ మనోడు చేసిన కామెడీకి సోషల్ మీడియాలో పేలిపోయింది. ఇప్పటికీ బండ్ల గణేష్ అంటే సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటారు. అంత చెడ్డ పేరు తీసుకొచ్చింది ఈయనకు. దాంతో రాజకీయాలంటే పూర్తిగా భయపడుతున్నాడు బండ్ల గణేష్.
తనకు ఇలాంటి రాజకీయాలతో పని లేదని ఇకపై కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. తనకు సినిమాలు తప్ప మరో లోకం లేదు..అనవసరంగా నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ చాలా సార్లు చెప్పాడు బండ్ల. అయినా కూడా ఈయన పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ తో ఆడుకుంటారు నెటిజన్స్. ఇప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే మరోసారి ఈయనను టార్గెట్ చేశారు. త్వరలోనే ఆయన బిజెపిలో చేరబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. దాంతో వెంటనే సోషల్ మీడియాలో తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించాడు గణేష్. అలాంటివేం లేవని..లేనిపోనివి సృష్టించి తనను ఇరకాటంలో పడేయొద్దు అంటున్నాడు బండ్ల గణేష్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
ట్రెండింగ్
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ రివ్యూ
- 'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'...ఇంట్రెస్టింగ్గా ట్రైలర్
- చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
- సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
- ట్రాక్‌పైకి సల్మాన్‌ఖాన్ 'టైగర్ 3'..!
- యాంకర్ ప్రదీప్ కు గీతాఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సపోర్టు
- నితిన్ కోసం రణ్‌వీర్‌సింగ్ మేకప్ ఆర్టిస్ట్..!
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!