సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 21:53:37

పూన‌మ్ కౌర్ కు జాతీయ స్థాయి గుర్తింపు..?

పూన‌మ్ కౌర్ కు జాతీయ స్థాయి గుర్తింపు..?

టాలీవుడ్ న‌టి పూన‌మ్ కౌర్ తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత పూన‌మ్ కౌర్ ఎలాంటి పోస్టులో క‌నిపించ‌లేదు. తాజాగా పూన‌మ్ కౌర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన‌ట్టు తెలుస్తోంది. భార‌తీయ ఉత్ప‌త్తులకు ఆద‌ర‌ణ క‌ల్పించ‌డంలో త‌న వంతు కృషి చేస్తున్న‌ పూన‌మ్ కౌర్ ను భార‌తీయ చేనేత, వ‌స్త్ర ప‌రిశ్ర‌మ జాతీయ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించేందుకు ఎంఎస్ఎంఈ  మంత్రిత్వ శాఖ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ మేర‌కు పూన‌మ్ కౌర్ పేరును సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ప్ర‌ధానమంత్రి కార్యాల‌యానికి పంపిన‌ట్టు టాక్ వినిపిస్తుంది. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ వార్త‌ల‌పై స్ప‌ష్ట‌త రానుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo