శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 16:37:56

రాంచ‌ర‌ణ్ ను అన్ ఫాలో చేసిన చిరంజీవి..!

రాంచ‌ర‌ణ్ ను అన్ ఫాలో చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మార్చిలో ఉగాది సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఖాతాలు తెరిచిన విష‌యం తెలిసిందే. ట్విట‌ర్ అకౌంట్ ద్వారా త‌నకు సంబంధించిన అప్ డేట్స్, ఇత‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంటున్నారు. బిజీ షెడ్యూల్ లోనూ అప్పుడపుడు అభిమానుల‌ను ప‌లుక‌రిస్తున్నాడు చిరు.  సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండే రాంచ‌ర‌ణ కూడా గతేడాది ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచాడు. ఇటీవ‌లే రాంచ‌ర‌ణ్ ను ఫాలో అవ‌డం మొద‌లుపెట్టిన చిరంజీవి..ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ అన్ ఫాలో చేశాడు. ఈ విష‌యంపై ఇపుడు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. కుమారుడిని అన్ ఫాలో చేసిన చిరంజీవి ఇపుడు ఫాలో అవుతున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా...? టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో హిట్టు కొట్టిన అనిల్ రావిపూడిని ఫాలో అవుతుండ‌టంతో..చిరు ఈ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్నాడా..? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవిని మాత్రం 821.9K ఫాలోవ‌ర్లతో త‌న అభిప్రాయాల‌ను షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.